Balakrishna: ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి: బాలకృష్ణకు రోజా కౌంటర్

Roja comments on Balakrishna

  • అక్కినేనా.. తొక్కినేనా అన్న బాలయ్య
  • ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న రోజా
  • బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారని వ్యాఖ్య

'అక్కినేనా.. తొక్కినేనా' అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, సినీ నటి రోజా స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచించుకోవాలని అన్నారు.  మరోపక్క, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna
Telugudesam
Tollywood
Roja
YSRCP
  • Loading...

More Telugu News