Balakrishna: బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్న హరీశ్ శంకర్!

Balakrishna in Harish Shankar Movie

  • మెగా హీరోలకు హిట్స్ ఇస్తూ వచ్చిన హరీశ్ శంకర్ 
  • పవన్ తో ప్రాజెక్టు మరింత ఆలస్యం 
  • బాలయ్య - మైత్రీ కాంబోలో మరో మూవీ 
  • అనిల్ రావిపూడి తరువాత లైన్లో హరీశ్ శంకర్

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కి మంచి పేరు ఉంది. తన సినిమాలకి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు ఆయనే సమాకూర్చుకుంటాడు. వరుసగా మెగా హీరోలకు సక్సెస్ లను ఇస్తూ వెళ్లిన ఆయన, పవన్ తో మరోసారి సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందనేది తెలియదు.

చాలా కాలంగా ఆ ప్రాజెక్టు కోసమే వెయిట్ చేస్తూ వచ్చిన హరీశ్ శంకర్, ఇప్పుడు బాలకృష్ణ క్రేజ్ కి తగిన కథపై కసరత్తును మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. బాలయ్యతో హరీశ్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా కొంతకాలంగా ఒక వార్త షికారు చేస్తోంది. అది నిజమేననే విషయం మొన్న 'వీరసింహారెడ్డి' ఫంక్షన్లో తేలిపోయింది. 

బాలయ్య కోసం ఒక కథను రెడీ చేస్తున్నాననీ .. త్వరలోనే ఆయనకి వినిపించి ఓకే చేయించుకుంటానని హరీశ్ శంకర్ అన్నాడు. అంతేకాదు ఈ సినిమాను మైత్రీ వారు నిర్మిస్తారని హింట్ కూడా ఇచ్చాడు. ఇక స్టేజ్ పై బాలయ్య కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. తదుపరి సినిమాను ఆయన అనిల్ రావిపూడితో చేయనున్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ సినిమా ఉంటుందని అనుకోవచ్చు.

Balakrishna
Anil Ravipudi
Harish Shankar
  • Loading...

More Telugu News