Kodanda Ramireddy: బాలయ్యతో సినిమా చేయాలనుంది .. కానీ ఆయన వెంటపడను: దర్శకుడు కోదండరామిరెడ్డి 

Kodanda Ramireddy Interview

  • దర్శకుడిగా వరుస హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి 
  •  బాలయ్యతో 13 సినిమాలు చేశానని వ్యాఖ్య 
  • ఆయనతో మళ్లీ పనిచేయాలనుందని వెల్లడి
  • ఈ విషయంలో ఇబ్బంది పెట్టనని వివరణ

దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు తరువాత ఎక్కువ సక్సెస్ గ్రాఫ్ ఉన్న దర్శకులుగా కోడి రామకృష్ణ.. కోదండరామిరెడ్డి కనిపిస్తారు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి మాట్లాడుతూ .. "నేను హీరోను కావాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లాను. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పి, పీసీ రెడ్డిగారు గారు నన్ను వి. మధుసూదనరావుగారి దగ్గర దర్శకత్వ విభాగంలో చేర్చారు" అన్నారు.

దర్శకుడిగా నేను చాలా బిజీగా ఉండేవాడిని. నెలకి 3 సినిమాలు సెట్స్ పై ఉండేవి. 10 రోజులకి ఒక సినిమా చొప్పున షూటింగు పెట్టుకునేవాడిని. 3 నెలల ముందుగానే నేను చేయబోయే 3 సినిమాల స్క్రిప్ట్స్ రెడీగా ఉండేవి. సత్యానంద్ .. సత్యమూర్తి .. పరుచూరి .. యండమూరి వంటి రైటర్స్ అందుబాటులో ఉండటం వలన అది సాధ్యమైంది" అని చెప్పారు. 

"చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జునలతో ఎక్కువ సినిమాలు చేశాను. బాలయ్యతో 13 సినిమాలు చేశాను .. వాటిలో చాలావరకూ సూపర్ హిట్లే. మొన్న నేను 'అన్ స్టాపబుల్ 2' షోకి వెళ్లినప్పుడు ఆయన నన్ను ఎంతో అభిమానంతో చూసుకున్నారు. ఇద్దరం కలిసి భోజనం చేశాము. అలాగే చిరంజీవిగారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరితోను ఇంకా సినిమాలు చేయాలని ఉంది. అలా అని చెప్పేసి వాళ్ల వెంటపడి ఇబ్బంది పెట్టను. చేద్దామని వాళ్లు అంటే మాత్రం నేను రెడీగానే ఉన్నాను" అని అన్నారు.

Kodanda Ramireddy
Chiranjeevi
Balakrishna
  • Loading...

More Telugu News