Naatu Naatu: 'నాటు నాటు' పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారు

Naatu Naatu song gets Oscar nomination

  • ఆస్కార్ బరిలో తెలుగు పాట
  • నేడు నామినేషన్ల ప్రకటన
  • బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఐదు పాటలకు చోటు
  • తుది జాబితాలో చోటు దక్కించుకున్న నాటు నాటు

మొదటిసారి ఓ తెలుగు పాట ఆస్కార్ అవార్డుల బరిలో అడుగుపెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. ఇవాళ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ప్రకటన కార్యక్రమం జరుగుతోంది. 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. ఇదే కాకుండా, ఈ కేటగిరీలో హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) గీతాలు కూడా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి. 

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన నృత్యరీతులు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి.

Naatu Naatu
Song
Oscar
Nomination

More Telugu News