Oscar: కాసేపట్లో ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటన

Oscar nominations will be announced shortly

  • త్వరలో ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం
  • నేడు నామినేషన్ల ప్రకటన
  • భారత్ నుంచి పది చిత్రాలు
  • ఆర్ఆర్ఆర్ పై ఆశలు పెట్టుకున్న చిత్రబృందం

యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటన కాసేపట్లో వెలువడనుంది. త్వరలోనే 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా, ఆయా కేటగిరీల్లో చోటు దక్కించుకున్న చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్ల తుది జాబితాలు నేడు వెల్లడించనున్నారు. 

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటన కార్యక్రమం జరగనుంది. నామినేషన్ల ప్రకటనతో ఆస్కార్ అవార్డుల బరిలో తుదిపోరులో నిలిచే చిత్రాలు ఖరారవుతాయి. 

కాగా, భారత్ నుంచి ఈసారి 10 చిత్రాలు ఆస్కార్ నామినేషన్ల రేసులో ఉన్నాయి. ఛెల్లో షో చిత్రం భారత్ నుంచి ఆస్కార్ కు అధికారికంగా నామినేట్ కాగా... ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రమ్ రోణ, రాకెట్రీ, తుజ్యా సాథీ కహీ హై, గంగూబాయి కథియావాడి, మి వసంతరావ్, ఇరవిన్ నిళల్ కూడా అకాడమీ అవార్డుల రేసులో నిలిచాయి. 

ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే... ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లో కచ్చితంగా నామినేషన్ ఖరారవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Oscar
Nominations
Awards
RRR
India
  • Loading...

More Telugu News