KCR: కొత్త సచివాలయం పనులను పరిశీలించిన కేసీఆర్

KCR inspects secretariat works

  • చిన్నచిన్న పనులు మినహా పూర్తయిన సచివాలయం నిర్మాణం
  • 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంవో
  • ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. చిన్నచిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లను ఏర్పాటు చేశారు. మరోవైపు సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు జాతీయ స్థాయిలో పలువురు నేతలను ఆహ్వానించబోతున్నట్టు సమాచారం.

KCR
BRS
Secretariat
  • Loading...

More Telugu News