Ajay Devgan: కార్తి 'ఖైదీ' హిందీ రీమేక్ గా 'భోళా' .. టీజర్ రిలీజ్!

Bholaa teaser released

  • అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న 'భోళా'
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్
  • కీలకమైన పాత్రను పోషిస్తున్న టబు   
  • మార్ఛి 30వ తేదీన సినిమా రిలీజ్

కార్తి హీరోగా ఆ మధ్య వచ్చిన 'ఖైదీ' అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే లోకేశ్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. కార్తి కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సింగిల్ కాస్ట్యూమ్ తోనే సినిమా అంతా హీరో కనిపించడం ఈ కథలోని గొప్పతనం. 

తమిళంతో పాటు తెలుగులోను రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమాను, హిందీలో 'భోళా' టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న అజయ్ దేవగణ్ నిర్మాణ భాగాస్వామిగా కూడా ఉన్నాడు. భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. 

ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాలో, టబు .. లక్ష్మీరాయ్ .. మకరంద్ దేశ్ పాండే ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ .. అమల పాల్ ప్రత్యేకమైన పాత్రలలో కనిపించనున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News