RRR: ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ కే!

RRR bags Japan Academy Outstanding Foreign Film Award

  • ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్
  • ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డుల కైవసం
  • తాజాగా జపాన్ 46వ అకాడమీ అవార్డు
  • అవుట్ స్టాండింగ్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు రేసులో హాలీవుడ్ సినిమాలకు దీటుగా పలు కేటగిరీల్లో పోటీగా నిలుస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకుంది. జపాన్ 46వ అకాడమీ అవార్డుల్లో విదేశీ చిత్రాల విభాగంలో అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ పురస్కారానికి ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. ఈ అవార్డు కోసం రేసులో జేమ్స్ కామెరాన్ అద్భుతసృష్టి అవతార్-2 ఉన్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ విజేతగా నిలవడం విశేషం.

ఇటీవల జపాన్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ లో ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్న సమయంలో వారికి అపూర్వ ఆదరణ లభించింది. జపాన్ లో గతంలోనూ భారత చిత్రాలు విడుదల అయినా, వాటన్నింటిని మించి వసూళ్లు సాధించిన చిత్రం ఆర్ఆర్ఆర్. 

నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ ముంగిట శుభసూచకం కాగా, హాలీవుడ్ లో అనేక ఫిలిం క్రిటిక్ సర్కిళ్లు తమ ఫేవరెట్ చిత్రంగా రాజమౌళి సినిమాకే ఓటేశాయి. ఇవాళ ఆస్కార్ తుది నామినేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

RRR
Award
Outstanding Foreign Film
Japan Academy
Rajamouli
Junior NTR
Ram Charan
Tollywood
India
Oscar
Hollywood
  • Loading...

More Telugu News