Nikhil: 'ఆహా'లో '18 పేజెస్' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

18 pages will stream in Aha from 27th January

  • డిసెంబర్ 23న థియేటర్స్ కి వచ్చిన '18 పేజెస్'
  • నిఖిల్ జోడీ కట్టిన అనుపమ పరమేశ్వరన్ 
  • ప్రేమలో ఫీల్ ప్రధానంగా సుకుమార్ అందించిన కథ
  • ఈ నెల 27 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన కథా చిత్రాలలో '18 పేజెస్' ఒకటి. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాకి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి బన్నీవాసు నిర్మాతగా వ్యవహరించగా, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. 

డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. 'ధమాకా' వంటి మాస్ యాక్షన్ మూవీ పోటీగా ఉన్నప్పటికీ, సున్నితమైన ఈ ప్రేమ కథాంశం బాగానే వసూళ్లను రాబట్టింది. హీరో ... హీరోయిన్ ప్రత్యక్షంగా ప్రేమించుకోవాలి .. అరగంటకోసారి డ్యూయెట్స్ పాడుకోవాలి అనే కాన్సెప్ట్ కి ఈ కంటెంట్ పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. 

ఈ కారణంగా కంటెంట్ లోని ఫీల్ ను ఒడిసిపట్టుకునేవారికే ఈ సినిమా నచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్రైలర్ రన్ అవుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News