Aryan Gowra: యూత్ ను ఆకట్టుకుంటున్న 'ఓ సాథియా' సాంగ్!

O Saathiya lyrical song released

  • విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ' ఓ సాథియా'
  • ఆర్యన్ జోడీగా మిష్టి చక్రవర్తి
  • అలరిస్తోన్న జావేద్ అలీ ఆలాపన 
  • త్వరలోనే రానున్న రిలీజ్ డేట్ ప్రకటన

ప్రస్తుతం ఉన్న సినిమాలకు సంగీతం ఎంతగా ప్లస్ అవుతుందో అందరికీ తెలిసిందే. పాటలు బాగుంటే సినిమాలు హిట్ అవుతాయని అంతా నమ్ముతున్నారు. ఇక ప్రేమకథలకు మెలోడీ పాటలు తోడైతే జనాలకు ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో 'ఓ సాథియా' అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం.

 తన్విక - జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' సినిమాను నిర్మించగా, దివ్య భావన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో .. హీరోయిన్లుగా నటిస్తున్నారు. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా రీసెంటుగా విడుదల చేసిన 'ఓ సాథియా' టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. వన్ మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ పాటకి 'విన్నూ' సంగీతాన్ని అందించగా .. భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. జావెద్ అలీ ఆలపించాడు. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Aryan Gowra
Mishti Chakravarthi
Divya Bhavana
O Saathiya Movie

More Telugu News