Sunil Kumar: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ... ఏపీ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం

AP Govt transfers CID Chief Sunil Kumar

  • సీఐడీలో అదనపు డీజీ హోదాలో సునీల్ కుమార్
  • ఇటీవలే డీజీపీ హోదా కల్పించిన ప్రభుత్వం 
  • జీఏడీలో రిపోర్టు చేయాలంటూ తాజాగా ఆదేశాలు

ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సునీల్ కుమార్ ను ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించాయి. ఇటీవలే ఆయన సర్వీసు పరంగా ఉన్నత హోదా కూడా అందుకున్నారు. అంతలోనే ఆయనను బదిలీ చేయడం, అది కూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం పట్ల రాష్ట్ర వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Sunil Kumar
CID
DGP
Addl DG
GAD
Police
Andhra Pradesh
  • Loading...

More Telugu News