Babu Mohan: ఒకసారి శోభన్ బాబు కాల్ చేసి ఏమన్నారంటే ..!: బాబూ మోహన్

Babu Mohan Interview

  • స్టార్ కమెడియన్ గా చక్రం తిప్పిన బాబు మోహన్ 
  • తాను చాలా అదృష్టవంతుడినని వ్యాఖ్య 
  • సీనియర్ స్టార్ హీరోలందరితో చేశానని వెల్లడి 
  • శోభన్ బాబు భోజనానికి పిలిచారని హర్షం

బాబూ మోహన్ .. తెలుగు సినిమా హాస్యంపై తనదైన ముద్రవేసిన నటుడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీనీ అప్పట్లో అంతా ఎంజాయ్ చేశారు. బ్రహ్మానందం తరువాత బాబూ మోహన్ పేరునే చెప్పుకునేవారు. అలాంటి బాబూ మోహన్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి నటనకి దూరమయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"ఎన్టీ రామరావుగారు .. ఏఎన్నార్ గార్లతోనే నటించాను .. ఇక అంతకుమించిన అదృష్టం ఏముంటుంది? 'నా తమ్ముడు ఎక్కడా?' అని ఎన్టీ రామరావుగారు అంటే, 'ఏడి .. అందగాడు .. ఎక్కడా?' అని అక్కినేని అనేవారు. కృష్ణగారితోను .. కృష్ణంరాజు గారితోను కలిసి నటించాను. ఇక శోభన్ బాబుగారి ఇంట్లో భోజనమే చేశాను" అన్నారు.  

"చెన్నైలో ఒక సినిమా షూటింగులో ఉండాగా శోభన్ బాబుగారు కాల్ చేశారు. తమ ఇంటికి భోజనానికి రమ్మని చెప్పారు. షూటింగు కారణంగా కుదురుతుందా .. లేదా? అని నేను ఆలోచిస్తున్నాను. తన ఇంటికి ఎవరినీ భోజనానికి పిలవననీ, తన ఇంట్లో భోజనం చేసింది ఒక్క రాజబాబు మాత్రమేననీ .. రెండో వ్యక్తి బాబూ మోహన్ కానున్నాడని ఆయన అన్నారు. అది నిజంగా గొప్ప విషయంగా అనిపించింది. ఆయన ఆత్మీయతను మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చారు.

Babu Mohan
Sobhan Babu
NTR
ANR
  • Loading...

More Telugu News