Sensex: వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 91 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • నాలుగున్నర శాతానికి పైగా నష్టపోయిన అల్ట్రాటెక్ సిమెంట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివర వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 60,941కి పెరిగింది. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకుని 18,118 వద్ద స్ధిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.94%), సన్ ఫార్మా (-1.85%), టెక్ మహీంద్రా (-1.65%), టీసీఎస్ (-1.56%), ఇన్ఫోసిస్ (-1.47%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-4.62%), ఎన్టీపీసీ (-1.22%), టాటా స్టీల్ (-0.73%), ఎల్ అండ్ టీ (-0.58%), రిలయన్స్ (-0.54%).

  • Loading...

More Telugu News