sandeep kishan: ఆకట్టుకునేలా వున్న సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ ట్రైలర్

sandeep kishan pan india movie Michael trailer

  • గ్యాంగ్ స్టర్  పాత్రలో సరికొత్తగా కనిపించనున్న సందీప్ 
  • కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్
  • ప్రతి పాత్రను ఆసక్తికరంగా చూపెట్టిన దర్శకుడు

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం టాలీవుడ్‌ యువ నటుడు సందీప్‌ కిషన్‌ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. కమర్షియల్‌ హీరోగా గుర్తింపు కోసం పలు చిత్రాలు చేసినా సరైన విజయం సాధించలేకపోతున్నాడు. టాలీవుడ్ లో ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న సందీప్ కిషన్ కొంత విరామం తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రంతో ముందుకొస్తున్నాడు. 

ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘మైఖేల్‌’ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్రం బృందం ఈ రోజు విడుదల చేసింది. మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో నిండి ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రంజిత్‌ జయంకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌ చుట్టూ తిరిగే కథతో గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. 

వరుణ్ సందేశ్ భిన్నమైన పాత్రలో కనిపించగా.. విజయ్‌ సేతుపతి పాత్ర పవర్‌ ఫుల్‌గా ఉన్నట్టు ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. ‘మైఖేల్.. వీడో స్పైడర్ తెలుసా నీకు’ అంటూ గౌతమ్ మేనన్ వాయిస్ ఓవర్ తో సాగే ట్రైలర్ లో ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వచ్చాడు దర్శకుడు. వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటించింది. 

యాక్షన్ తో పాటు సందీప్, దివ్యాంశ మధ్య లవ్, ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఇందతా ఒక అమ్మాయి కోసం చేస్తున్నావా? నమ్మలేకపోతున్నా మైఖేల్’ అని గౌతమ్ మేనన్ ప్రశ్నించగా.. ‘అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సర్ మనిషి బతకాలి’ అని సందీప్ ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఈ చిత్రంతో అయినా సందీప్ ఖాతాలో మంచి హిట్ చేరుతుందేమో చూడాలి. .

sandeep kishan
Tollywood
pan india
Michael movie
trailer
Vijay Sethupathi
anasuya
varalaxmi

More Telugu News