upasana: రామ్ చరణ్ భార్య ఉపాసన నానమ్మ మృతి

Ram Charan wife Upasana grand mother passes away

  • ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారన్న ఉపాసన
  • ఎలా జీవించాలో ఆమె నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్య
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఉపాసన 

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నానమ్మ చివరి వరకు ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని చెప్పారు. జీవితాన్ని ఎలా జీవించాలో ఆమె ద్వారానే తాను తెలుసుకున్నానని వెల్లడించారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పారు. తన గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఎలాంటి అనుభూతులను పొందానో వాటన్నింటినీ తన పిల్లలకు అందిస్తానని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

More Telugu News