Balakrishna: 'అఖండ' నుంచి బాలయ్యను శివుడుగానే చూస్తున్నాను: తమన్

veerasimha Redddy Celebrations

  • 'వీరసింహారెడ్డి' సెలబ్రేషన్స్ లో తమన్ 
  • 'భైరవద్వీపం'తో తన కెరియర్ మొదలైందని వ్యాఖ్య
  • తన లైఫ్ కి బాలయ్యే శివుడని వెల్లడి 
  • బాలయ్యను చూసి నేర్చుకోవలసింది చాలా ఉందని వివరణ

'వీరసింహారెడ్డి' సక్సెస్ లో తమన్ సంగీతం .. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో తమన్ మాట్లాడుతూ .. బాలయ్య బాబు 'భైరవద్వీపం' సినిమాతోనే నా కెరియర్ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది" అన్నారు. 

'అఖండ' నుంచి నేను బాలయ్యను శివుడు మాదిరిగానే చూస్తున్నాను .. నా లైఫ్ కి ఆయనే శివుడు. అందువల్లనే ఆయన సినిమాకి ఇలాంటి మ్యూజిక్ ను ఇవ్వగలుగుతున్నాను. ఆయన యాక్టింగ్ మరొకరికి సాధ్యం కాదు. ఆయన నిజాయితీ కలిగిన మనిషి .. ఆయన దగ్గర ఫేక్ మాట్లాడలేము" అని చెప్పారు. 

"బాలయ్య .. చిరంజీవి వంటి వారి సినిమాలకి పనిచేసే అవకాశం రావడం నిజంగా గిఫ్ట్. ఈ రోజుకీ వారిద్దరూ పోటీపడుతూ వెళుతున్నారు. ఇండస్ట్రీకి కావలసింది ఇస్తూ వెళుతున్నారు. వారిని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. పరిగెత్తవలసింది ఎంతో ఉంది" అని అన్నారు.

Balakrishna
Sruthi Haasan
Honey Rose
Thaman
  • Loading...

More Telugu News