Balakrishna: 'వీరసింహా రెడ్డి'లో ఆ సీన్ చూసి నన్ను చంపేస్తారేమో అనుకున్నాను :వరలక్ష్మి శరత్ కుమార్

veerasimha Redddy Celebrations

  • బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'వీరసింహారెడ్డి'
  • భానుమతి పాత్ర గురించి ప్రస్తావించిన వరలక్ష్మి శరత్ కుమార్ 
  • ఫైట్స్ .. మ్యూజిక్ హైలైట్ అంటూ హర్షం 
  • బాలయ్యకి అభిమానిగా మారిపోయానని వెల్లడి

బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటించగా, బాలయ్య చెల్లెలు భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించింది. నెగెటివ్ షేడ్స్ తో ఆమె పాత్ర నడుస్తుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆమె మాట్లాడారు. 

"ఈ సినిమాను నేను చూశాను .. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ చూసి షాక్ అయ్యాను. ఆ ఫైట్స్ చూస్తూ జై బాలయ్య .. జై బాలయ్య అని అరిచి గొంతు పోయింది. తమన్ సార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ప్రతి షాట్ లోను నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా తరువాత నేను బాలయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను" అన్నారు. 

"భానుమతి పాత్ర ఇంతగొప్పగా డిజైన్ చేసిన గోపీచంద్ మలినేనిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంట్రవెల్ బ్లాక్ లో నేను బాలయ్య బాబును పొడిచేసే సీన్ చూసి .. ఆయన అభిమానులు నన్ను చంపేస్తారేమోనని భయపడ్డాను. ఆ విషయంలో బాలయ్య బాబు నాకు ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్" అంటూ చెప్పుకొచ్చారు.

Balakrishna
Sruthi Haasan
Varalakshmi Sharathkumar
  • Loading...

More Telugu News