Chiranjeevi: ఇంట్రడక్షన్ సీన్ కోసం చిరంజీవిగారు 10 రోజులపాటు నీళ్లలో తడిశారు: దర్శకుడు బాబీ

Bobby Interview

  • తాజా ఇంటర్వ్యూలో 'వాల్తేరు వీరయ్య' గురించిన ప్రస్తావన 
  • ఈ సినిమా హిట్ కొడుతుందని తెలుసన్న డైరెక్టర్ 
  • కష్టంతో మాత్రమే మెగా మనసును గెలుచుకోగలమని వెల్లడి

చిరంజీవి - బాబీ కాంబినేషన్లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ .. "ఈ సినిమాను నేను ఎడిటింగ్ రూమ్ లో ఓ రెండు మూడొందల సార్లు చూసి ఉంటాను. ఏ సీన్ చూసినా ఇంతకంటే బెటర్ గా తీసి ఉంటే బాగుండేది కదా అనిపించలేదు. అప్పుడే నాకు ఈ సినిమాపై కాన్ఫిడెన్స్ వచ్చేసింది" అన్నాడు. 

"ఈ సినిమా ఏదో మేజిక్ చేయబోతోంది .. రికార్డ్స్ సృష్టించబోతోంది అనుకున్నాను. జనాలు వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేస్తారని అనుకోలేదు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ ను సముద్రం నేపథ్యంలో తీశాము. షాట్ అనుకున్న విధంగా రావడం కోసం చిరంజీవి గారు 10 రోజుల పాటు నీళ్లలో తడిశారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉండటం కోసం ఆయన అంతగా కష్టపడ్డారు" అని చెప్పాడు. 

"చిరంజీవిగారు అందరితోను ఆభిమానంగాను .. ప్రేమగాను ఉంటారు. ఎవరు కష్టపడితే ఆయన వారిని ఇష్టపడతారు. అభిమానినని చెప్పుకోవడం .. ఆయన కనపడగానే కాళ్లపై పడటం వలన కాదు, కష్టపడితేనే ఆయన మనసును గెలుచుకోగలం అనే విషయం నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.

Chiranjeevi
Sruthi Haasan
Bobby
Waltair Veerayya Movie
  • Loading...

More Telugu News