Anikha Surendran: 'బుట్టబొమ్మ' రిలీజ్ వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Buttabomma New Release Date

  • సరికొత్త ప్రేమకథగా 'బుట్టబొమ్మ'
  • తెలుగు తెరకి అనిఖ సురేంద్రన్ పరిచయం
  • ప్రతినాయకుడిగా అర్జున్ దాస్ 
  • వచ్చేనెల 4వ తేదీన సినిమా రిలీజ్  


తెలుగు ప్రేక్షకులు ప్రేమకథా చిత్రాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. సరైన కంటెంట్ ఉంటే చాలు .. హిట్ తీసుకొచ్చేసి చేతిలో పెడుతున్నారు. స్టార్స్ తో పని లేకుండా బాక్సాఫీస్ కి భారీ వసూళ్లను అప్పగిస్తున్నారు. అలాంటి ఓ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి, శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో 'బుట్టబొమ్మ' రెడీ అవుతోంది. 

సూర్య వశిష్ఠ - అనిఖ సురేంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో విలన్ గా అర్జున్ దాస్ కనిపించనున్నాడు. ఇది ఒక పల్లెటూరి ప్రేమకథ .. తమ ప్రేమను బ్రతికించడం కోసం పోరాడే జంట కథ అనే విషయం ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైపోయింది. అనిఖ సురేంద్రన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. 

ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా టీమ్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. వచ్చేనెల 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ టీనేజ్ లవ్ స్టోరీ యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

Anikha Surendran
Surya Vshishta
Arjundas
Buttabomma Movie
  • Loading...

More Telugu News