Nagarjuna: 'అంతం' ఆడితే 'సత్య' సినిమా తీసేవాడినే కాదు: వర్మ

Ram Gopal Varma Interview

  • కెరియర్ ఆరంభంలో వరుస హిట్స్ ఇచ్చిన వర్మ 
  • మాఫియా సినిమాల స్పెషలిస్ట్ గా క్రేజ్ 
  • 'అంతం' ఫ్లాప్ గురించిన ప్రస్తావన 
  • అదే కథను 'సత్య'గా తీశానని వెల్లడి

రాంగోపాల్ వర్మ తన కెరియర్ ఆరంభంలో వరుస విజయాలను అందుకుంటూ వెళ్లారు. ముఖ్యంగా మాఫియా .. దెయ్యం కథల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు, కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. తన మనసులోని మాటలను ఎంతమాత్రం దాచుకోకుండా .. తడుముకోకుండా చెప్పడం వర్మ ప్రత్యేకత.

తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఒక సినిమా హిట్ .. ఫ్లాప్ .. వరస్ట్ అనే విషయాలను వసూళ్లను బట్టి నేను లెక్కించను. ఆ సినిమా తీసే సమయంలో నా దగ్గరున్న సోర్స్ ఏమిటి? ఎంతవరకూ వాటిని ఉపయోగించుకోగలిగాను అనేదే చూసుకుంటాను" అన్నారు. 

" నా కెరియర్లో నేను చెడగొట్టిన కథ ఏదైనా ఉందీ అంటే అది 'అంతం' మాత్రమే. కాకపోతే బాలీవుడ్ లో నేను నిలదొక్కుకోవడానికి కారణం 'అంతం' సినిమానే. ఆ సినిమా ఫ్లాప్ అయింది కనుకనే, మళ్లీ నేను దానిని 'సత్య' సినిమాగా తీశాను. సేమ్ స్టోరీని తీస్తే ఆడేసింది. అదే 'అంతం' ఆడితే 'సత్య'ను తీసేవాడిని కాదు" అంటూ చెప్పుకొచ్చారు.

Nagarjuna
Urmila
Antham Movie
Tollywood
  • Loading...

More Telugu News