Gopichand Malineni: 'క్రాక్' సీక్వెల్ పై స్పందించిన గోపీచంద్ మలినేని!

Gopichand Malineni Interview

  • 'వీరసింహారెడ్డి'కి సీక్వెల్ ఉండదన్న గోపీచంద్  
  • 'క్రాక్' సీక్వెల్ ఉంటుందంటూ వివరణ 
  • సీక్వెల్ కి ఆ కథ అనుకూలమని వెల్లడి 
  • రవితేజతో హ్యాట్రిక్ హిట్ కొట్టానంటూ హర్షం

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'వీరసింహారెడ్డి' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అంతకుముందు బాలయ్య చేసిన 'అఖండ' మాదిరిగానే, ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేనికి ఇదే ప్రశ్న ఎదురైంది. 

అందుకు ఆయన స్పందిస్తూ .. 'వీరసింహారెడ్డి' సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన లేదు. కానీ 'క్రాక్' సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయమని చాలామంది అడుగుతున్నారు. నేను .. రవితేజ కూడా ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే అనుకుంటున్నాము" అన్నారు. 

దర్శకుడిగా నన్ను నమ్మి ఫస్టు నాకు ఛాన్స్ ఇచ్చింది రవితేజనే. ఆయనతో ఇంతవరకూ చేసిన సినిమాలు ఒకదానికి మించి మరొకటి విజయాలను సాధించాయి. 'క్రాక్' సినిమాకి కథా పరంగా సీక్వెల్ చేసే ఛాన్స్ ఉంది. అందువలన ఆ సినిమా సీక్వెల్ ఉంటుందని నమ్మకంగా చెప్పగలను" అంటూ క్లారిటీ ఇచ్చారు.

Gopichand Malineni
Balakrishna
Raviteja
  • Loading...

More Telugu News