Aishvarya Rajesh: 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న 'డ్రైవర్ జమున'

Driver Jamuna Streaming in Aha

  • హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ బిజీ 
  • తెలుగులోను మంచి గుర్తింపు 
  • డిసెంబర్ 30న థియేటర్లకు వచ్చిన 'డ్రైవర్ జమున'
  • నిన్నటి నుంచి 'ఆహా'లో అందుబాటులో

ఐశ్వర్య రాజేశ్ తెలుగులో 'రాంబంటు' సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైంది. ఆ తరువాత వరుస తమిళ సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె, కథానాయికగా తమిళ సినిమాతోనే వెండితెరకి పరిచయమైంది. 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో హీరోయిన్ గా తెలుగులో తొలి సినిమా చేసింది. అప్పటి నుంచి తెలుగులో అడపాదడపా కనిపిస్తూనే వస్తోంది. 

తెలుగు .. తమిళంతో పాటు మలయాళంలోను ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. నాయిక ప్రధానమైన పాత్రలను కూడా ఆమె చేస్తూ వెళుతోంది. అలా ఆమె చేసిన సినిమానే 'డ్రైవర్ జమున'. డిసెంబర్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ టైమ్ కరెక్ట్ కాకపోవడం వలన, ఈ సినిమా వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. 

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ .. జమున పాత్రలో .. తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక మినిష్టర్ ను చంపడానికి బయల్దేరిన నలుగురు క్రిమినల్స్ ఆమె కారును బుక్ చేసుకుంటారు. వాళ్ల మాటల వలన జమునకు విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందనేదే కథలో ప్రధానమైన అంశం. 'ఆహా' ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందనేది చూడాలి.

Aishvarya Rajesh
Driver Jamuna Movie
Aha
  • Loading...

More Telugu News