Brahmaji: మంత్రి రోజాపై సినీ నటుడు బ్రహ్మాజీ సెటైర్

Actor Brahmaji satires on Roja

  • ఇటీవల మెగా ఫ్యామిలీపై విమర్శలు గుప్పించిన రోజా
  • వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారన్న రోజా
  • చిన్న ఆర్టిస్టుల వ్యాఖ్యలకే ఎందుకు భయపడుతున్నారన్న బ్రహ్మాజీ

మెగా ఫ్యామిలీపై ఏపీ మంత్రి రోజా చేసిన విమర్శలు పెద్ద దుమారాన్నే రేపాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని ఆమె అన్నారు. సినిమాల ద్వారా ఎంతో సంపాదించుకున్న వీరు... ఎవరికీ సాయం చేయలేదని, అందుకే వీరిని ప్రజలు ఆదరించలేదని విమర్శించారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే సినీ పరిశ్రమలో లేకుండా చేసేస్తారని అన్నారు. ఈ భయంతోనే చిన్న ఆర్టిస్టులు వారికి అనుకూలంగా మాట్లాడుతుంటారని చెప్పారు. 

రోజా వ్యాఖ్యలపై తాజాగా సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించాడు. వారి పార్టీలో చేరమని కానీ, పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని కానీ మెగా ఫ్యామిలీ తనను ఎప్పుడూ అడగలేదని ఆయన అన్నారు. మిమ్మల్ని విమర్శించింది చిన్న ఆర్టిస్టులే (హైపర్ ఆది) కదా... చిన్న ఆర్టిస్టుల విమర్శలకే ఎందుకంత భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రోజాను జనసేనాని పవన్ కల్యాణ్ డైమండ్ రాణి అని సంబోధించిన సంగతి తెలిసిందే.

Brahmaji
Tollywood
Roja
YSRCP
Mega Family
  • Loading...

More Telugu News