Gopichand Malineni: 'వీరసింహారెడ్డి' అంచనాలు అందుకోవడానికి గట్టి కసరత్తు చేశాం: గోపీచంద్ మలినేని

Gopichand Malineni Interview

  • ఈ నెల 12వ తేదీన వచ్చిన 'వీరసింహారెడ్డి'
  • తొలిరోజు వసూళ్ల విషయంలో కొత్త రికార్డు 
  • సక్సెస్ పై స్పందించిన గోపీచంద్ మలినేని 
  • రామ్ లక్ష్మణ్ ఫైట్స్ హైలైట్ అంటూ కితాబు

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని రూపొందించిన 'వీరసింహా రెడ్డి' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఓపెనింగ్స్ విషయంలో బాలయ్య కెరియర్లోనే కొత్త రికార్డును సృష్టించింది. తాజాగా ఈ సినిమాను గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడాడు. 

'వీరసింహారెడ్డి' సినిమాలో సీనియర్ బాలయ్య ఒక ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ తో కనిపిస్తారు. ఆ కాస్ట్యూమ్స్ విషయంపైన కూడా ఎంతో కసరత్తు చేశాము. ఇంతకుముందు నేను చేసిన 'క్రాక్' .. బాలయ్య చేసిన 'అఖండ' భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది" అన్నారు. 

'ఈ సినిమా సక్సెస్ కి మిగతా అంశాలతో పాటు ఫైట్స్ కూడా ప్రాధాన కారణాల్లో ఒకటిగా నిలిచాయి. కథ వేరు .. ఫైట్స్ వరకూ వేరు అనుకోకుండా, కథలోని ఎమోషన్ ను దృష్టిలో పెట్టుకునే రామ్ లక్ష్మణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తారు. అదే వారి ప్రత్యేకత .. అక్కడే వారు సక్సెస్ అయ్యారు" అని చెప్పుకొచ్చాడు.

Gopichand Malineni
Veerasimha Reddy Movie
Balayya
  • Loading...

More Telugu News