Aparna Balamurali: నటి అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన... వీడియో ఇదిగో!

Student indecent behavior towards actress Aparna Balamurali

  • సూరారై పొట్రుతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ
  • తాజాగా తంకమ్ చిత్రంలో నటించిన వైనం
  • కేరళలోని ఓ లా కాలేజిలో ప్రమోషన్ ఈవెంట్
  • అపర్ణ భుజంపై చేయి వేసి ఫొటో దిగేందుకు ప్రయత్నించిన విద్యార్థి

సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ బాలమురళి హాజరైంది. చిత్రబృందంతో కలిసి అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. 

నేరుగా వేదికపైకి వచ్చిన ఆ కుర్రాడు అపర్ణ చేయి పట్టుకుని పైకి లేపి, ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అపర్ణ సున్నితంగా అతడి చేయిని విడిపించుకుని తన సీట్లో కూర్చుంది. ఇతర యూనిట్ సభ్యులు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ యువకుడు వేదిక దిగి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News