Bandi Sanjay: కేసీఆర్ బీఆర్ఎస్ సభకు కుమారస్వామి, నితీశ్ కుమార్ రాకపోవడంపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

bandi sanjay fires on KCR

  • నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
  • కుమారస్వామి, నితీశ్ ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్న
  • దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని విమర్శ

నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను కేసీఆర్ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఈ సభకు తరలి వచ్చారు. ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ సభకు హాజరయ్యారు. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం సభకు హాజరుకాలేదు. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పారు. 

కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సభకు కుమారస్వామి, నితీశ్ ఎందుకు రాలేదని సంజయ్ ఎద్దేవా చేశారు. రైతుబంధు పేరిట రైతులకు అందించిన సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసిందని దుయ్యబట్టారు. దేశంపై కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్ గురించి కేసీఆర్ ఒక్కసారైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్ ను సీడీఎస్ చీఫ్, దివంగత బిపిన్ రావత్ సూచించారని... ఆయన కంటే కేసీఆర్ కు ఎక్కువ తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా పూర్తి విద్యుత్ లేదని చెప్పారు.

Bandi Sanjay
BJP
KCR
TRS
  • Loading...

More Telugu News