Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ఇదే!

Varun Tej new movie title announced

  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ తాజా చిత్రం
  • నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు
  • 'గాండీవధారి అర్జున' టైటిల్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
  • మోషన్ పోస్టర్ కూడా విడుదల

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టు టైటిల్ ను చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పేరు 'గాండీవధారి అర్జున'. వరుణ్ తేజ్ జన్మదినం పురస్కరించుకుని టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ చిత్రం అని అర్థమవుతోంది.

'గాండీవధారి అర్జున' చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రం కానుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.

Varun Tej
Gandeevadhari Arjuna
Title
Praveen Sattaru
BVSN Prasad
Tollywood
  • Loading...

More Telugu News