Team India: ఇషాన్, నేను ప్రతీరోజు కొట్టుకుంటాం: గిల్

 Me and Ishan Kishan fight every day says gill
  • ఇషాన్ తన రూమ్ మేట్ అని వెల్లడించిన శుభ్ మన్
  • ఉప్పల్ వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్
  •  మ్యాచ్ తర్వాత రోహిత్, ఇషాన్ తో సరదా సంభాషణ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హైదరాబాదులో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 149 బంతుల్లోనే 208 పరుగులు చేసిన గిల్.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అతని మెరుపులతో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్, కీపర్ ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ ముచ్చటించాడు. బీసీసీఐ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో గిల్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. తమ డ్రెస్సింగ్ రూమ్ లోపల చోటుచేసుకునే కొన్ని కథలను వెల్లడించాడు. 

తన రూమ్ మేట్ అయిన ఇషాన్ మ్యాచ్ ముందురోజు తనను ఎలా ఇబ్బంది పెడతాడనే సరదా విషయాలను వివరించాడు. ‘ఇషాన్ నా ప్రీ-మ్యాచ్ దినచర్యను నాశనం చేస్తాడు. అతనెప్పుడూ ఐప్యాడ్‌లో సినిమాలు చూస్తూ ఉంటాడు. కానీ ఎయిర్‌పాడ్‌లను ఉపయోగించడు. పెద్ద సౌండ్ పెట్టుకొని సినిమాలు చూస్తు నన్ను ఇబ్బంది పెడతాడు. నన్ను సరిగ్గా నిద్రపోనివ్వడు. నేను తనను తిడుతూ సౌండ్ తగ్గించమని చెబుతుంటా. కనీసం ఎయిర్‌పాడ్‌లు అయినా పెట్టుకోవాలని చెబుతా. కానీ, తను పట్టించుకోడు. పైగా ఇషాన్ నన్ను కొడతాడు. ఇది అతని గది అని, తన ఇష్టం వచ్చినట్టు ఉంటానని అంటాడు. ఇలా మేం ప్రతిరోజూ కొట్టుకుంటూ ఉంటాం. అదే నా ప్రీ-మ్యాచ్ రొటీన్’ అని గిల్ చెప్పుకొచ్చాడు.
Team India
shubhman gill
ishan kishan
Rohit Sharma

More Telugu News