Samantha: 'శాకుంతలం' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్!

Shaakuntalam lyrical song released

  • సమంత ప్రధాన పాత్రగా రూపొందిన 'శాకుంతలం'
  • దృశ్యకావ్యంగా మలచిన గుణశేఖర్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మణిశర్మ సంగీతం
  • మనసును పట్టుకుంటున్న 'మల్లికా' మెలోడీ  
  • వచ్చేనెల 17వ తేదీన సినిమా రిలీజ్  

ఈ తరం దర్శకులలో సాంఘికాలతో పాటు పౌరాణిక .. చారిత్రక చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించగల దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి పేరు ఉంది. కథాకథనాలతో పాటు అందుకు తగిన పాళ్లలో గ్రాఫిక్స్ ఎక్కడ ఉపయోగించాలనే విషయాలపై ఆయనకి మంచి అవగాహన ఉంది. అలాంటి గుణశేఖర్ తాజా చిత్రంగా 'శాకుంతలం' రూపొందింది. 

గుణశేఖర్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'మల్లికా మల్లికా .. మాలతీ మాలిక, చూడవా .. చూడావా .. ఏడే నా ఏలిక' అంటూ ఈ పాట సాగుతోంది. 

మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీని రమ్య బెహ్రా ఆహ్లాదకరంగా ఆలపించింది. గ్రాఫిక్స్ ద్వారానే ఆవిష్కరించిన ఈ పాట హృద్యంగా నడుస్తోంది. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రలలో మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి నటించారు. వచ్చేనెల 17వ తేదీన ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Samantha
Dev Mohan
Mohan Babu
Gouthami
Shaakuntalam Movie

More Telugu News