Shubhmann Gill: హైదరాబాద్ వన్డేలో శుభ్ మాన్ గిల్ డబుల్ సెంచరీ

Shubhmann Gill double ton gives Team India huge total against New Zealand

  • ఉప్పల్ స్టేడియంలో భారత్, కివీస్ మధ్య మొదటి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు
  • 149 బంతుల్లో 208 రన్స్ బాదిన గిల్
  • 19 ఫోర్లు, 9 సిక్సర్లతో వీరవిహారం

భారత యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ హైదరాబాద్ వన్డేలో అదరగొట్టాడు. న్యూజిలాండ్ తో మొదటి వన్డేలో సిక్సర్లు, ఫోర్ల మోత మోగించిన గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా బరిలో దిగిన ఈ 23 ఏళ్ల రైట్ హ్యాండర్ 149 బంతుల్లో 208 పరుగులు చేయడం ఉప్పల్ స్టేడియంలో హైలైట్ గా నిలిచింది. గిల్ స్కోరులో 19 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. 

చివర్లో లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన గిల్ ద్విశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో షిప్లే బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్ డబుల్ సెంచరీ సాయంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్ 2, షిప్లే 2, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నెర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News