Team India: ఉప్పల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

India chose batting in uppal odi

  • న్యూజిలాండ్ తో తొలి వన్డేలో తలపడుతున్న టీమిండియా
  • తుది జట్టులోకి ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శార్దూల్
  • సొంతగడ్డపై సిరాజ్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ 

ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో తొలి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ పోరులో భారత తుది జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నారు. 

ఇక కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్, శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ జట్టులోకి వచ్చారు. శ్రీలంకతో మూడో వన్డేకు దూరంగా ఉన్న హార్దిక్ తిరిగొచ్చాడు. స్పిన్ ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ను కొనసాగించగా.. స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఉమ్రాన్ మాలిక్ బదులు శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు తన సొంతగడ్డ అయిన హైదరాబాద్ లో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 

భారత తుది జట్టు: రోహిత్, గిల్, కోహ్లీ, కిషన్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, ఠాకూర్, కుల్దీప్, షమీ, సిరాజ్.
న్యూజిలాండ్ జట్టు: అలెన్, కాన్వే, నికోల్స్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, సాంట్నర్, షిప్లీ, ఫెర్గూసన్, టిక్నర్.

Team India
Team New Zealand
uppal stadium
odi
hyderabad
  • Loading...

More Telugu News