Dhanush: ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్టుతో 'అథర్వ' .. స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Sir lyriccal song released

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'అథర్వ' 
  • హీరోగా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న కార్తీక్ రాజు
  • ముగింపు దశకి చేరుకున్న పోస్టు ప్రొడక్షన్ పనులు 
  • త్వరలో నాలుగు భాషల్లో విడుదల

హీరోగా కార్తీక్ రాజు విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇంతవరకూ చేసిన 'పడేసావే' .. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' .. 'కౌసల్య కృష్ణ మూర్తి' వంటి సినిమాలు ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అథర్వ' రెడీ అవుతోంది. ఈ రోజున (జనవరి 17)న కార్తీక్ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా 'అథర్వ' యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ 'అథర్వ' సినిమాను మహేష్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి .. ఐరా .. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు .. సిమ్రన్ చౌదరి ..  ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. 

ఈ పోస్టర్‌ తో పాటు మోషన్ పోస్టర్ .. గ్లింప్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే టీజర్‌ .. ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Dhanush
Samyuktha Menon
Sir Movie
  • Loading...

More Telugu News