ALI: జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ

I am ready to contest on Pawan Kalyan says Ali

  • పవన్ తనకు మంచి మిత్రుడన్న అలీ
  • సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని వ్యాఖ్య
  • వైసీపీ 175 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పవన్ పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. 

ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 175 స్థానాలను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఆదేశం మేరకు ఎక్కడైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ చిత్రాల్లో ఒకటి, రెండు మినహా అన్ని సినిమాల్లో అలీ నటించారు. అయితే, గత ఎన్నికల సమయం నుంచీ ఆయన వైసీపీకి అనుకూలంగా మారారు.

ALI
Tollywood
JAGAN
YSRCP
PAWAN
JANASE
  • Loading...

More Telugu News