Balakrishna: హానీ రోజ్ .. సీనియర్ హీరోలకు మంచి జోడీ దొరికేసినట్టే!

Honey Rose Special

  • 2005 నుంచి మలయాళ ఇండస్ట్రీలో ఉన్న హానీ రోజ్   
  • 'వీరసింహారెడ్డి'తో తెలుగుతెరకి పరిచయం    
  • బాలయ్య జోడీగా మెప్పించిన అందాల రాశి 

తెలుగులో ఈ మధ్య కాలంలో సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికలు దొరకడం కష్టమైపోతోంది. కాజల్ .. శ్రియ .. తమన్నా వంటివారి జోరు తగ్గడంతో, కొత్త కథానాయికలను సీనియర్ స్టార్ హీరోల జోడీగా దింపడానికి ఎప్పటికప్పుడు దర్శకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'వీరసింహారెడ్డి' సినిమాతో తెలుగు తెరకి హనీ రోజ్ పరిచయమైంది. 

హానీరోజ్ .. కేరళ బ్యూటీ. 2005లోనే మలయాళ సినిమాతో ఆమె కెరియర్ మొదలైంది. అప్పటి నుంచి మలయాళ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ, అడపాదడపా  తమిళ .. కన్నడ సినిమాలు చేస్తూ వెళుతోంది. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే హానీ రోజ్, 'వీరసింహారెడ్డి' సినిమాలో తొలిసారిగా తెలుగు తెరపై కనిపించింది. 

అటు యంగ్ బాలకృష్ణకి తల్లిగాను .. సీనియర్ బాలకృష్ణకి ప్రియురాలి పాత్రలోను ఆమె గొప్పగా నటించింది. మంచి ఫిట్ నెస్ తో అటు చీరకట్టులోను .. ఇటు మోడ్రన్ డ్రెస్ లలోను మంచి మార్కులను కొట్టేసింది. ఇకపై సీనియర్ స్టార్ హీరోల సరసన ఇక్కడ ఆమె బిజీ కావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే జరుగుతుందేమో చూడాలి మరి..

Balakrishna
Honey Rose
Veerasimha Reddy Movie
  • Loading...

More Telugu News