Samanta: 'శాకుంతలం' ఫస్టు సింగిల్ రిలీజ్ డేట్ ఖరారు!

Shaakuntalam  Movie Update

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'శాకుంతలం'
  • దుష్యంతుడిగా కనిపించనున్న దేవ్ మోహన్ 
  • ఈ నెల 18వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్   
  • ఫిబ్రవరి 17న ఐదు భాషల్లో సినిమా విడుదల

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైంది. ఆయన దృశ్యకావ్యంగా మలచిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన 'మల్లిక .. ' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. 

శకుంతల పాత్రను సమంత పోషించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ పరిచయం కానున్నాడు. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు. 

Samanta
Dev Mohan
Mohan Babu
Prakash Raj
Shaakuntalm Movie
  • Loading...

More Telugu News