Sudheer Babu: సిక్స్ ప్యాక్ చూపించడం నాకు ఇష్టం ఉండదు: సుధీర్ బాబు

Sudheer Babu Interview

  • సుధీర్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'హంట్'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తానని వెల్లడి 
  • ద్విపాత్రాభినయం కాదని వ్యాఖ్య 
  • జిమ్ కి వెళ్లేది హెల్త్ కోసమేనని స్పష్టీకరణ

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో 'హంట్' సినిమా రూపొందింది. సుధీర్ బాబు హీరోగా మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శ్రీకాంత్ .. భరత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను డ్యూయెల్ రోల్ చేశానని అనుకుంటారు .. కానీ అలాంటిదేం లేదు. పాత్ర పరంగా రెండు రకాలుగా కనిపిస్తాను అంతే. ఈ కథలో నేను పోలీస్ ఆఫీసర్. ప్రమాదం జరగడానికి ముందు .. ఆ తరువాత అన్నట్టుగా ఆ పాత్ర ముందుకు వెళుతుంది" అన్నాడు. 

" నా సినిమాల్లో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది .. కానీ నాకు ఎమోషనల్ కంటెంట్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ఆరోగ్యంగా ఉండటం కోసం జిమ్ చేస్తాను .. అంతేగానీ సిక్స్ ప్యాక్ చూపించడం కోసం కాదు. నిజానికి షర్ట్ తీయాలంటే నేను చాలా ఇబ్బంది పడిపోతాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News