Balakrishna: బాలయ్య సినిమాకి మా కీ బోర్డ్స్ చాలడం లేదు: తమన్

Veera Simha Reddy Movie Update

  • ఈ నెల 12న విడుదలైన 'వీరసింహారెడ్డి'
  • సంగీత దర్శకత్వం వహించిన తమన్ 
  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమా 
  • బాలయ్య 70MM మనిషి అంటూ తమన్ ప్రశంసలు

బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వీరసింహారెడ్డి' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలోని అన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి రాయడం విశేషం. ఇక తమన్ ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. పాటలన్నీ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని .. తమన్ .. రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. తమన్ మాట్లాడుతూ .. "బాలయ్య సినిమాను 70 MMలో చూడాలని అభిమానులు అనుకుంటారు .. నిజానికి ఆయనే 70MM. ఆయన సినిమాలకు సంగీతాన్ని అందించాలంటే మా కీ బోర్డ్స్ చాలడం లేదు" అన్నారు. 

"బాలయ్య మా సంగీతాన్ని మాగ్నెట్ లా లాగేసుకుంటున్నారు. ఆయన యాక్టింగ్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. 'అఖండ' సినిమాకి అదే జరిగింది .. ఈ సినిమా విషయంలోను అదే జరిగింది. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా నాపై పూర్తి నమ్మకం పెడతాడు. దాంతో మరింత టెన్షన్ తో పనిచేస్తూ ఉంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Balakrishna
Gopichand Malineni
Thaman
Veerasimha Reddy
  • Loading...

More Telugu News