Chiranjeevi: 100 కోట్ల క్లబ్ లో 'వాల్తేరు వీరయ్య'
- ఈ నెల 13న విడుదలైన 'వాల్తేరు వీరయ్య'
- సెకండాఫ్ నుంచి రవితేజతో కలిసి సందడి
- 3 రోజుల్లోనే 108 కోట్ల వసూళ్లు
- లాంగ్ రన్ లో రాబట్టేదానిపై అంచనాలు
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. తొలిరోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 3 రోజుల్లోనే 108 కోట్లను రాబట్టింది. ఈ కథకి చిరంజీవితో పాటు రవితేజ కూడా తోడవడంతో, సెకండాఫ్ నుంచి ఎమోషన్ ను కూడా తోడుచేసుకుని నడుస్తుంది. ఇక దేవిశ్రీ పాటలు ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి.
చిరంజీవి సరసన నాయికగా శ్రుతిహాసన్ అలరించగా, ఐటమ్ సాంగులో ఊర్వశి రౌతేలా కనువిందు చేసింది. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి.