Prime Minister: ఢిల్లీలో ప్రధాని భారీ రోడ్డు షో.. నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Two day key BJP meet starts today with PM Modis roadshow

  • పటేల్ చౌక్ నుంచి పార్లమెంట్ వీధి వరకు నిర్వహణ
  • బీజేపీ జాతీయ సమావేశాలకు హాజరు
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి నడ్డా ఎన్నిక

నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు సమావేశాలకు హాజరు కానున్నారు. మొత్తం మీద 350 మందికి ప్రవేశం ఉంటుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో భారీ రోడ్డు షోలో పాల్గొననున్నారు. పటేల్ చౌక్ నుంచి పార్లమెంట్ వీధి వరకు రోడ్డు షో ఉంటుంది. ఎన్ డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని రోడ్డు షో, బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణకు ఆంక్షలు అమలు చేయనున్నారు. 

గుజరాత్ లో భారీ విజయం తర్వాత బీజేపీ జాతీయ సమావేశాలు మొదటిసారి జరుగుతున్నాయి. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కానున్నారు. గుజరాత్ లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ తిరిగి 2024లో కూడా ప్రధాని అవుతారన్న సందేశాన్ని ఇచ్చినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 


Prime Minister
Narendra Modi
bjp
natonal executive meet
raod show
  • Loading...

More Telugu News