KA Paul: పవన్ కల్యాణ్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నారో చెప్పాలి: కేఏ పాల్

KA Paul asks Pawan Kalyan why he splits votes
  • ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ వ్యాఖ్యలు
  • పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటాడని విమర్శలు
  • పవన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సలహా
  • లేకపోతే తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని అన్నారు. పవన్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని నిలదీశారు. పవన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేఏ పాల్ సలహా ఇచ్చారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకోకపోతే తమ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పవన్ కు ఆహ్వానం పలికారు. 

ఇక, ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీవో నెం.1ని స్వాగతిస్తున్నట్టు పాల్ వెల్లడించారు. వైసీపీ నేతలు ఇరుకు సందుల్లో పెట్టినా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. 

అది ప్రాణాలు కాపాడే జీవో అని పేర్కొన్నారు. మూడేళ్ల కిందటే రావాల్సిన జీవో అని, ఇప్పటికి వచ్చిందని అన్నారు. అయితే, దీన్ని న్యాయస్థానం సస్పెండ్ చేయడం పట్ల కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసింది న్యాయమూర్తే అయినా తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.
KA Paul
Pawan Kalyan
Prajasanthi Party
Janasena

More Telugu News