Padmarao: కోడిపందాల్లో అపశ్రుతి... కోడికత్తి తగిలి వ్యక్తి మృతి

Man died as cockfight knife cuts his veins

  • తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
  • అనంతపల్లి గ్రామంలో కోడిపందాలు
  • చూసేందుకు వెళ్లిన పద్మారావు అనే వ్యక్తి
  • మోకాలి వెనుక భాగంలో గుచ్చుకున్న కోడికత్తి
  • నరాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం

సంక్రాంతి వేళ కోడిపందాలు చూడ్డానికి వెళ్లిన వ్యక్తి కోడికత్తి తగిలి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో చోటుచేసుకుంది. 

అనంతపల్లి గ్రామానికి చెందిన పద్మారావు ఊర్లో కోడిపందాలు నిర్వహిస్తుండడంతో చూసేందుకు వెళ్లాడు. బరిలో పోట్లాడుకుంటున్న కోళ్లు ఒక్కసారిగా పద్మారావు ఉన్నచోటికి దూసుకొచ్చాయి. ఈ క్రమంలో ఒక కోడికి కట్టిన కత్తి పద్మారావు మోకాలి వెనుకభాగంలో గుచ్చుకుంది. కోడికత్తులు ఎంతో పదునుగా ఉంటాయి. దాంతో పద్మారావు మోకాలి వెనుకభాగంలో నరాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. 

అపస్మారక స్థితిలో నేలకొరిగిన ఆ వ్యక్తిని మిత్రులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అనంతపల్లి విషాదంలో మునిగిపోయింది. పద్మారావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Padmarao
Death
Cockfight
Ananthapalli
East Godavari District
  • Loading...

More Telugu News