shooting: రెండు షూటింగ్ వరల్డ్ కప్స్ కు అర్హత సాధించిన తెలుగమ్మాయి

Esha singh qualifies shooting world cup

  • ట్రయల్స్ లో సత్తా చాటిన యువ షూటర్ ఇషా సింగ్
  • 581 స్కోరుతో స్వర్ణం గెలిచిన ‌‌క్రీడాకారిణి
  • ఫిబ్రవరి, మార్చిలో జరిగే వరల్డ్ కప్స్ లో పాల్గొననున్న ఇషా సింగ్

కొన్నాళ్లు తన గురితో అదరగొడుతున్న హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ మరో ఘనత సాధించింది. ఇన్నాళ్లూ అంతర్జాతీయ స్థాయిల్లో జూనియర్ లెవెల్లో పతకాల మోత మోగించిన ఆమె ఇప్పుడు సీనియర్ విభాగంలో రాణించేందుకు రెడీ అవుతోంది. ఇషా సింగ్ సీనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించింది. 

ఢిల్లీలో జరిగిన ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇషా 581 స్కోరుతో స్వర్ణం గెలిచింది. దీంతో ఫిబ్రవరిలో ఈజిప్టు, మార్చిలో భోపాల్‌ వేదికలుగా జరిగే వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో తలపడేందుకు అర్హత సాధించింది. ఈ రెండు ప్రపంచ కప్ ఈవెంట్లు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత పాయింట్లు అందిస్తాయి. వీటిలో సత్తా చాటితే ఇషా సింగ్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ లోనూ ముందంజ వేయనుంది.

shooting
esha sigh
world cup
Hyderabad
gold
  • Loading...

More Telugu News