Gudivada Amarnath: బాబు-పవన్ బంధం బట్టబయలైంది: మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath slams Chandrababu and Pawan Kalyan
  • ఇటీవల పవన్ యువశక్తి సభ
  • సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు
  • అదేస్థాయిలో బదులిచ్చిన వైసీపీ మంత్రులు
  • పవన్ ను ఎందుకు తిడుతున్నారన్న చంద్రబాబు
  • చంద్రబాబుకు పవన్ సహధర్మచారిణి అన్న అమర్నాథ్
పవన్ కల్యాణ్ తాను ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టంగా చెప్పాడు... వైసీపీ నేతలు ఎందుకు అతడిని తిడుతున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనానికి మద్దతు పలకడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సహధర్మచారిణి అని, అందుకే పవన్ ను విమర్శిస్తే చంద్రబాబుకు ఆగ్రహం కలుగుతోందని అన్నారు. 

అసలు, జనసేన కంటే ముందు చంద్రబాబు స్పందిస్తున్నారని తెలిపారు. బాబు, పవన్ మధ్య బంధం ఇప్పుడందరికీ తెలిసిపోయిందని, ఆ బంధాన్ని సక్రమం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. 

చంద్రబాబు బెదిరింపులకు తమ కార్యకర్త కూడా భయపడడని స్పష్టం చేశారు. చంద్రబాబే పెద్ద సైకో అని, సొంత తమ్ముడ్ని గొలుసులతో కట్టేశాడని ఆరోపించారు. చంద్రబాబు వెనుక 5 కోట్ల మంది ఉంటే కుప్పం స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.
Gudivada Amarnath
Chandrababu
Pawan Kalyan
YSRCP
TDP
Janasena

More Telugu News