Lalit Modi: లలిత్ మోదీకి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ సపోర్ట్ పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్

Lalit Modi on ventilator

  • రెండు వారాల్లో రెండు సార్లు కరోనా బారిన పడిన లలిత్ మోదీ
  • న్యుమోనియాతో కూడా బాధపడుతున్న వైనం
  • విషయాన్ని స్వయంగా వెల్లడించిన లలిత్ మోదీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా సోకింది. అంతేకాదు న్యుమోనియాతో కూడా ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నారు. 

తాను అనారోగ్యం బారిన పడిన విషయాన్ని ఆయన స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. రెండు వారాల్లో తనకు రెండు సార్లు కరోనా వచ్చిందని ఆయన చెప్పారు. న్యుమోనియా కూడా తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్ లో చేరినట్టు తెలిపారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. 'గెట్ వెల్ సూన్' అని హర్భజన్ మెసేజ్ చేశాడు.

Lalit Modi
Covid
Health
  • Loading...

More Telugu News