Jagan: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!

CM Jagan attends Sankranti celebrations at camp office

  • నేడు భోగి
  • సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గోశాలలో సంక్రాంతి సంబరాలు
  • సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్

ఇవాళ భోగి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎం జగన్, ఆయన అర్ధాంగి వైఎస్ భారతి సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలతో గోశాల కళకళకలాడింది. సంక్రాంతి సంబరాలను సీఎం జగన్, భారతి దంపతులు ఉత్సాహంగా తిలకించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Jagan
Sankranti
Camp Office
Goshala
Tadepalli
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News