Aryan Goura: విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా 'ఓ సాథియా' మోషన్ పోస్టర్‌ రిలీజ్!

O Saathiya Movie Motion Poster Released

  • దివ్య భావన దర్శకతవంలో 'ఓ సాథియా'
  • ఆర్యన్ గౌర జోడీగా మిష్టి చక్రవర్తి 
  • ఫస్టు సింగిల్ రిలీజ్ కి సన్నాహాలు 
  • త్వరలోనే విడుదల కానున్న సినిమా  

సినిమా పరిశ్రమలో లేడీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. అలాంటిది ఓ సినిమాకు దర్శకత్వం వహించింది .. నిర్మాతగా వ్యవహరించింది మహిళలు కావడం విశేషం. అలా ఇద్దరు మహిళలు కలిసి తీసిన చిత్రమే 'ఓ సాథియా'. తన్విక - జశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. 

'ఓ సాథియా' సినిమాలో ఆర్యన్ గౌర .. మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. ఇంతకు ముందు 'జీ జాంబీ' అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన రెండో సినిమాగా 'ఓ సాథియా' రాబోతోంది. రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది. 

ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు విన్ను అందించిన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వేణు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ  సినిమా నుంచి రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు..

Aryan Goura
Misti Chakravarthi
O Saathiya Movie
  • Loading...

More Telugu News