Vijay: తమిళనాట తమన్ పేరు మారుమ్రోగిపోతోంది: 'వారసుడు' ప్రెస్ మీట్ లో శ్రీకాంత్

Varasudu Press Meet

  • తమిళంలో నిన్న విడుదలైన 'వరిసు'
  • తొలి ఆటతోనే అక్కడ హిట్ టాక్ 
  • ఈ నెల 14వ తేదీన ఇక్కడ రిలీజ్ కానున్న 'వారసుడు'
  • ఇక్కడ కూడా హిట్ ఖాయమని చెప్పిన శ్రీకాంత్ 

విజయ్ హీరోగా తమిళంలో రూపొందిన 'వరిసు' నిన్న తమిళనాట విడుదలైంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమా 'వారసుడు' పేరుతో ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు .. వంశీ పైడిపల్లి .. తమన్ .. జయసుధ .. శ్రీకాంత్ .. శరత్ కుమార్ .. కిక్ శ్యామ్ పాల్గొన్నారు. 

శ్రీకాంత్ మాట్లాడుతూ .. "వంశీ పైడిపల్లి కూడా రాజమౌళిగారి మాదిరిగానే తాను అనుకున్న విధంగా అవుట్ పుట్ వచ్చేవరకూ చెక్కుతూనే ఉంటాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించడం ఆయన ప్రత్యేకత. తన సినిమా ద్వారా నన్ను కోలీవుడ్ కి పరిచయం చేయడం ఆనందంగా ఉంది" అన్నారు. 

"దిల్ రాజు గారు నిర్మించిన ఈ సినిమాలో .. ఆందునా విజయ్ తో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న విడుదలైన ఈ సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. అందరూ కూడా తమన్ గురించి చెప్పుకుంటున్నారు. అక్కడ ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. అదే స్థాయిలో ఇక్కడ కూడా 'వారసుడు' హిట్ కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Vijay
Rashmika Mandanna
Srikanth
Jayasudha
Varasudu Movie
  • Loading...

More Telugu News