Tollywood: ధమాకా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

Dhamaka Digital Premieres Netflix On January 22nd 2023

  • డిసెంబర్ 23న విడుదలైన చిత్రం
  • రూ. 100 కోట్ల కలెక్షన్లతో రవితేజ ఖాతాలో భారీ విజయం
  • ఈ నెల 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి

‘ధమాకా’ చిత్రంతో మాస్ మహారాజా రవితేజ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ, యువ హీరోయిన్ శ్రీలీల నటన అందరికీ నచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హుషారైన పాటలకు అభిమానులు ఫిదా అయ్యారు. దాంతో, తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబట్టింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే  రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ధమాకాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. 

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా, బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే సంగీతం అందించగా, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కరిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.  ‘ధమాకా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తంతో హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ జనవరి 22 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.  

Tollywood
dhamaka
movie
Raviteja
ott
netflix
  • Loading...

More Telugu News