RRR: ప్రతీ భారతీయుడు గర్వించే ఘనత ఇది.. ఆర్ఆర్ ఆర్​ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్రధాని మోదీ హర్షం

PM Modi congratulates RRR team over golden globe award

  • నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు
  • లాస్ ఏంజెల్స్ లో పురస్కారం స్వీకరించిన ఎంఎం కీరవాణి
  • చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసిన ప్రధాని

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ తో పాటు దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రస్తావిస్తూ చిత్ర బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన ప్రదానోత్సవంలో కీరవాణి అవార్డు అందుకున్నారు. ‘ఇది చాలా ప్రత్యేకమైన ఘనత. ఎంఎం కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ కు నా అభినందనలు. ఎస్ఎస్ రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మొత్తం చిత్ర బృందాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

More Telugu News