Santhosh Sobhan: ప్రభాస్ రిలీజ్ చేసిన 'కల్యాణం కమనీయం' సాంగ్ ఇదే!

Kalyanam Kamaneeyam song released

  • సంతోష్ శోభన్ హీరోగా 'కల్యాణం కమనీయం'
  • కథానాయికగా ప్రియా భవాని శంకర్ సందడి 
  • యూవీ కాన్సెప్ట్స్  బ్యానర్ పై నిర్మితమైన సినిమా 
  •  సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల

సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ వారు ' కల్యాణం కమనీయం' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రభాస్ చేతుల మీదుగా ఒక సాంగ్ ను రిలీజ్ చేయించారు. 'సింగిల్ లైఫ్ అంటే సింపుల్ అంటారు .. బాబూ చెయ్యొద్దా తప్పు' అంటూ ఈ పాట మొదలవుతోంది. 'కల్యాణం కమనీయం కద బాసూ .. అరె సోలోగున్నావంటే ఉండదు జోషు' అంటూ నడుస్తుంది. 

శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటకి యశ్ కొరియోగ్రఫీని నిర్వహించాడు. పెళ్లికి శర్వానంద్ ను హీరో ఒప్పించడమనే ఒక కాన్సెప్ట్ ను తీసుకుని, ఆ అంశానికి ఈ పాటను లింక్ చేసి వదిలారు. పెద్ద సినిమాల మధ్యలో బరిలోకి దిగుతున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News